హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలోని నల్ల చెరువుకు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం గండి పెట్టారు. చెరువులో నీటిని అక్రమంగా తోడేస్తున్న విషయమై నీటి పారుదల శాఖ డీఈకి స్థానికులు పిర్యాదు చేశారు. కాగా స్పందించిన ఆయన సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి గండిని పూడ్చారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ ఎవరైనా ఉద్దేశపూరితంగా చెరువులకు గండ్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.