హుజూర్‌నగర్: వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రద్దు చేయాలి

80చూసినవారు
హుజూర్‌నగర్: వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రద్దు చేయాలి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం నుండి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై జరిగే నిరసనకు ముస్లిం మైనార్టీలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై కక్షగట్టి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చింది అన్నారు. తమ పూర్వీకులు దానం చేసిన భూములను లాక్కునే విధంగా నల్ల చట్టం రూపొందించారని దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్