హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్‌గా కె. సతీష్ కుమార్ నియమితులయ్యారు. గతంలో మోత్కూర్ మున్సిపాలిటీలో పనిచేసిన ఆయనను ప్రభుత్వం హుజూర్‌నగర్‌కు బదిలీ చేసింది. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న శ్రీనివాస్ బదిలీ నేపథ్యంలో సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్న సతీష్ కుమార్ నియామకంతో పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.