హుజూర్నగర్ గ్రంథాలయానికి కుర్చీలు, సామాగ్రిని బహుకరించిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గుంతకల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, యువత గ్రంథాలయంలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, అజీజ్ బాషా, శివరాం యాదవ్ పాల్గొన్నారు. దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.