హుజూర్నగర్ పట్టణంలో బుధవారం ఉదయం ఐజల్ వాటర్ ప్లాంట్లో ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్న రాసమళ్ల కృష్ణ (40) విద్యుత్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ముత్యాలమ్మ బజార్లోని శ్రీదేవి ఇంటి వద్ద వాటర్ ట్యాంక్ నింపే క్రమంలో మోటార్ స్విచ్ బోర్డ్లో ప్లగ్ పెట్టే సమయంలో విద్యుత్ వైర్ల నుంచి షాక్ తగిలి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాసమళ్ల సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.