మేళ్లచెరువు మండల కేంద్రంలో శనివారం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు రేవూరుకు పొలం పనులకు వెళ్తుండగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు భయాందోళనకు గురయ్యారు.