ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దతు ధర కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. యాసంగిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా కాగా, కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని చెప్పిందని, అయితే తాము మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికి 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని, తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొంటున్నామని ఆయన పేర్కొన్నారు.