కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్‌లో జూన్ 14 ఆదివారం మధ్యాహ్నం 2. 30 గంటలకు ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొంటారు. ఓటరు జాబితాల సవరణ, నమోదు, పరిశీలన వంటి అంశాలపై తెలంగాణ పీసీసీ నియమించిన శిక్షకులు శిక్షణ ఇస్తారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పీసీసీ సభ్యులు, బ్లాక్ అధ్యక్షులు హాజరు కావాలని కోరారు.