మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య హుజూర్‌నగర్‌లో బలహీన వర్గాల హౌసింగ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 2000 ఇళ్ల పురోగతిని సైట్‌లోనే పరిశీలించి సమీక్షిస్తారు. అనంతరం 3.30 నుంచి 4 గంటల వరకు మూసీ నదిపై బెట్టెతండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య కోదాడ మండలంలోని రెడ్లకుంట, రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిని సమీక్షిస్తారు.