తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని, ఆమె కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. కవిత టీఆర్ఎస్ లో ఉన్నారా లేక బయట ఉన్నారా అని ప్రశ్నిస్తూ, ఆమె ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.