హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘును మంత్రి
కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో
కేటీఆర్ స్వయంగా రఘుకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజాసేవలో ముందుండే వ్యక్తులు బీఆర్ఎస్‌లోకి రావడం శుభపరిణామమని
కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పిల్లుట్ల రఘు తెలిపారు.