హుజూర్నగర్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు క్యాట్ లెవెల్2 పోటీ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ పోసాని వెంకటరమణారావు తెలిపారు. ఈ పరీక్షల్లో మొత్తం 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
మ్యాట్ (మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్) విభాగంలో శ్రీవల్లి, చరిత, జగదీష్, గీర్వాణి అనే నలుగురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రూ. 1000 నగదు బహుమతి, గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ పొందారని , చాట్ (కెమిస్ట్రీ ఆప్టిట్యూడ్ టెస్ట్) విభాగంలో నామ జోష్, శ్రీనిధి, సౌమ్యశ్రీ, ధీరజ్ సాయి, శాన్విక, చేతన్ శ్రీవత్సవ లు వెయ్యి రూ. లు పొందారన్నారు