పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఐదవ తరగతి పూర్తి చేసుకుని ఆరో తరగతిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు బుధవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు మాట్లాడుతూ, ప్రాథమిక విద్య జీవితానికి పునాది లాంటిదని, చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, శ్రమ, లక్ష్యసాధన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని విద్యార్థులకు సూచించారు.