మౌలిక హక్కులపై ప్రజలకు అవగాహన

3చూసినవారు
మౌలిక హక్కులపై ప్రజలకు అవగాహన
హుజూర్ నగర్ నియోజకవర్గంలో, 11వ వార్డ్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో హుజూర్‌నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు బుధవారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక హక్కులపై ప్రజలకు అవగాహన ఉండాలని సూచించారు. ఆర్టికల్స్ 14 నుంచి 32 వరకు ఉన్న మౌలిక హక్కులు, మహిళలు, బాలలు, మైనారిటీల హక్కులు, హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కత్తి సతీష్ కుమార్, ఎస్ఐ బలరాం రెడ్డి, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్