హుజూర్‌నగర్ పట్టణంలోని జడ్‌పి హెచ్‌ఎస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం సోమవారం ఎంపీపీఎస్ ఎన్‌ఎస్‌పీ క్యాంప్, సీతారాంనగర్, మల్లన్న నగర్ పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహించారు.