లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు

0చూసినవారు
లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు
హుజూర్‌నగర్‌లో టౌన్ సీఐ చలమంద రాజు ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. 18 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, తల్లిదండ్రులు పిల్లల కదలికలు, స్నేహాలు, ఆన్‌లైన్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :