శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో 212వ అన్నప్రసాద వితరణ

0చూసినవారు
శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో 212వ అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 212వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. అనంతారపు నాగచారి కళ్యాణి, విఘ్నేశ్ నాగరాజు, దాసరి అప్పారావు, వరలక్ష్మి మరియు నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించారు. ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి.హనుమంతరావు, వి. కృష్ణమూర్తి, సెక్రటరీ తిరుపతయ్య, ఉమామహేశ్వర్రావు, లాస్యచరిత, శిరీష, పెద్ది శేషు, ఆర్జే రవీంధ్ర, విశాల్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్