కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ సెంటర్ వద్ద అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని సీఐ శివ శంకర్ తెలిపారు. వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేయాలని, పార్టీ గుర్తులు ధరించి గుంపులుగా రావద్దని సూచించారు. 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, అనుమతి లేకుండా ర్యాలీలు, డీజేలు నిషేధమని, సెల్‌ఫోన్లు సెంటర్‌లోకి అనుమతి లేదని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.