కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

0చూసినవారు
కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు
కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ విద్యార్థినులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్