సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్గో కేంద్రానికి చేరుకున్న అనుమానాస్పద సరుకు కలకలం రేపింది. రాజమహేంద్రవరం నుంచి కోదాడకు నాలుగు బస్తాల్లో వచ్చిన సుమారు 200 కిలోల పట్టీకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సారా తయారీలో దీనిని వినియోగించే అవకాశం ఉందని ప్రాథమిక విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరుకు పంపిన, స్వీకరించాల్సిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.