కోదాడ లోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ యాకూబ్ అనే యువకుడి రెండు కాళ్లపై నుండి దూసుకెళ్లడంతో ఆయన కాళ్లు తీవ్రంగా నలిగిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన యాకూబ్, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.