ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయాలి

0చూసినవారు
ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయాలి
కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో ముదిరెడ్డి ఆదిరెడ్డి 29వ వర్ధంతి సభ సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం. ముత్యాలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ, మునగాల పరగణ ప్రజల ముద్దుబిడ్డగా పేరుపొందిన ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామసభలు నిర్వహించి చైతన్యం కల్పించి, ఇల్లు లేని వారికి బంజరాయు భూములను పంచిన ఘనత ఆదిరెడ్డిదేనని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్