హుజూర్ నగర్ లోని తిలక్‌నగర్ లో ఇటీవల మృతి చెందిన బైరం వెంకయ్య కుటుంబానికి చైతన్య భారతి డిగ్రీ కళాశాల (2001–04 బ్యాచ్) పూర్వ విద్యార్థులు రూ. 15,000 ఆర్థిక సహాయం, ఓపెన్ ఐస్ సొసైటీ వారు 50 కేజీల బియ్యం అందించారు. కుటుంబ యజమాని మృతి నేపథ్యంలో, ప్రతినెల రూ. 1500 చొప్పున రెండేళ్లపాటు పెన్షన్ ఇస్తామని సొసైటీ ప్రధాన కార్యదర్శి సులువ శ్రీను తెలిపారు. మృతుని ఇద్దరు కుమార్తెల చదువు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేశామని వారు పేర్కొన్నారు.