వేణుగోపాలాపురం లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

690చూసినవారు
వేణుగోపాలాపురం లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
నడిగూడెం మండలం వేణుగోపాలాపురం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామస్థులు ఆవిష్కరించారు. దాతల సహకారంతో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను యువత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లు నరసింహారావు, పోటు ప్రసాద్, ఎర్నేని కృష్ణయ్య, శరత్, ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సంపతి లక్ష్మీనారాయణ, లావూరి శ్రీనివాస్, బరిగెల శ్రీకాంత్, గండమళ్ళ వెంకన్న, లావూరి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you