అలరించిన యలమర్తి అనుబంధ ఆత్మీయ సమ్మేళనం

1చూసినవారు
అలరించిన యలమర్తి అనుబంధ ఆత్మీయ సమ్మేళనం
కోదాడ మండలం తోగర్రాయి గ్రామానికి చెందిన యలమర్తి అనుబంధ కుటుంబాల సభ్యులు కోదాడ పట్టణంలోని ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో సుమారు 90 సంవత్సరాల తర్వాత 500 కుటుంబాలకు చెందిన సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి మార్గంలో నడవాలని సూచించారు. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంతో విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు సాగాలని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా కుటుంబ బంధాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్