అభ్యర్థులతో కిక్కిరిసిపోయిన కార్యాలయం

3చూసినవారు
అభ్యర్థులతో కిక్కిరిసిపోయిన కార్యాలయం
శుక్రవారం కోదాడ మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుతో కిక్కిరిసిపోయింది. వివిధ పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీలుగా తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు. గడువు ముగిసే సమయానికి నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు పోటీ పడటంతో కార్యాలయ ఆవరణలో కోలాహలం నెలకొన్నది. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేయగా, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

ట్యాగ్స్ :