విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని అనంతగిరి మండలం శాంతినగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సీహెచ్ పురుషోత్తం అన్నారు. శుక్రవారం మండలం లోని వెంకట్ రామాపురం పాఠశాల లో మధ్యాహ్న భోజనం పరిశీలించి మాట్లాడారు. మధ్యాహ్నభోజన నిర్వహకులు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. అనంతరం విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రంగారావు, ఉపాధ్యాయులు ఉన్నారు.