విద్యార్ధుల నమోదు పెంచాలని అనంతగిరి ఎంఇఓ తల్లాడ శ్రీనివాస్ అన్నారు. గురు వారం మండలం లోని రంగాపురం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత నాణ్యమైన విద్యతో పాటు దుస్తులు, పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సువార్త , హెచ్ఎమ్ ఏడు కొండలు, ఉపాధ్యాయులు ఉన్నారు.