అనంత గిరి: ఎమ్మెల్యే ను కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ

4చూసినవారు
అనంత గిరి: ఎమ్మెల్యే ను కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని అనంతగిరి నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, నూతన ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు గుడిమెట్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఇరుగు వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి, మండలంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143 యూనియన్ కోదాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిచలం నరేష్, క్యు న్యూస్ కోదాడ ఇంచార్జ్ బానోత్ రవిచంద్ర కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్