జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ మంగళవారం అనంత గిరి, కోదాడ మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ వివరాలను టీ యాప్‌లో నమోదు చేయాలని, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యా నారాయణ కూడా పాల్గొన్నారు.