శ్రీనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న దానం

1268చూసినవారు
శ్రీనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న దానం
కోదాడ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం  శ్రీనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం గణనాథుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం అన్నదానం ప్రారంభమైంది. కాలనీవాసులతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బత్తినేని హనుమంతరావు, సత్యనారాయణరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్