
భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్‌లోని సూరత్‌లో ఒక మూడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక బాలుడు, నలుగురు మహిళలు మంటల్లో చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.




