కాంగ్రెస్ కార్యకర్తకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి

950చూసినవారు
కాంగ్రెస్ కార్యకర్తకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి
కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాలేబోయిన వెంకటేశ్వర్లు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాపుగల్లు గ్రామ ఒకటవ ఎంపీటీసీగా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తాను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానని, తనకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎంపీటీసీగా అవకాశం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.