తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ దూరవిద్య కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోదాడ జారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎస్. కె. జహీర్ తెలిపారు. కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలతో చదువు ఆపిన వారికి, ఉద్యోగం చేసుకుంటూనే చదువు కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన వారు 2026 ఆగస్టు 29లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు అనంతగిరి రోడ్డులోని కార్యాలయాన్ని లేదా 98484 12323 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.