తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, 14 ఏళ్లు నిండిన వారు ఎలాంటి విద్యార్హత లేకున్నా పదో తరగతిలో చేరవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణులు ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేయవచ్చు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. జూలై 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు నయానగర్‌లోని లక్ష్య డిస్టెన్స్ అకాడమీ లేదా 9542107771, 7981528312 నంబర్లను సంప్రదించవచ్చు.