కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, క్రీడాకారులు రాణించి కోదాడకు రాష్ట్రంలో గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ గురవమ్మ సైది బాబు, ఎంఈఓ సలీం షరీఫ్, జూలూరి వీరభద్రం, చిలుముల వెంకటేష్, పంది కళ్యాణ్ బాబు, చిన్న మారుతి శ్రీను, నాగుల మీరా పాల్గొన్నారు.