కోదాడ బస్టాండ్ ఎదురుగా యువకుడు యువతిని కత్తితో మెడ కోసి హత్య చేసిన సంఘటన కలకలం రేపుతుంది. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల కలహాలు పడుతున్నట్లు సమాచారం. యువకుడిది చిలుకూరు మండలం కటకముల గూడెం అని స్థానికులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోలీసులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హంతకుడు పరారైనట్లు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.