కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

7చూసినవారు
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
మేళ్లచెరువు నుంచి రేవూరు వైపు పత్తి, మిర్చి కూలీలను తీసుకెళ్తున్న ఆటో రేవూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో బోల్తా పడింది. రోడ్డుపై అకస్మాత్తుగా కుక్క దూసుకురావడంతో డ్రైవర్ తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది కూలీలలో నలుగురికి స్వల్ప గాయాలు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.