కోదాడలో ఆటో బోల్తా: ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

1978చూసినవారు
కోదాడలో ఆటో బోల్తా: ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం, శాంతినగర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకు చెందిన సైదులు అనే వ్యక్తి మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదంపై సైదులు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్