ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం

0చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం
నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందని ఎంపీడీఓ ఇషాక్ హుస్సేన్, ఎంఇఓ సలీం షరీఫ్ అన్నారు. తమ్మర ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవం సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిని కూడా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని, కోదాడ మండలాన్ని విద్యా అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రాంబాబు, కౌన్సిలర్లు సామినేని రజినీ నరేష్, రాంబాబు, గోపి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్