కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ 21వ వార్డులో జనగణన-2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం జరిగింది. సర్కిల్ నంబర్ 20 పరిధిలోని గృహ గణన విభాగం నంబర్ 0078లో జరిగిన ఈ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. ప్రజలు స్వయంగా స్వీయ గణన పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, సూపర్వైజర్ సాదె లక్ష్మీనారాయణ, ఎన్యుమరేటర్ జూలకంటి సమత, వార్డు ఆఫీసర్ శివారెడ్డి, అడ్వకేట్ పగడాల రామచంద్ర రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేవరం శ్రీనివాస్ రెడ్డి, పగడాల చంద్రారెడ్డి, ఉపాధ్యాయులు వేణుబాబు పాల్గొన్నారు.