కోదాడ పట్టణంలోని నయానగర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో షీ టీమ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ కె. నరసింహ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ ఎస్‌ఐ మల్లేష్ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ చట్టాలు, వేధింపుల నివారణ, సోషల్ మీడియా వినియోగం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తతపై వివరించారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని, గుర్తుతెలియని లింకులను తెరవవద్దని సూచించారు. సైబర్ మోసాలకు 1930, అత్యవసర వేధింపుల ఫిర్యాదులకు 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటనారాయణ ఉన్నారు.