అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యం లో అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలు

2చూసినవారు
కోదాడ సమీపంలోని కూచిపూడి తండా అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం, పుట్టినరోజు వేడుకలు కోదాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అర్చకులు రవి స్వామి పర్యవేక్షణలో పంచామృత అభిషేకాలు, పడి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ప్రసాద వితరణ చేపట్టారు. బొలిశెట్టి కృష్ణయ్య, బత్తిని కృష్ణ, వంగవీటి నాగరాజు, గాలి శ్రీనివాస్ నాయుడు, స్వామి పుల్లయ్య, నాగేశ్వరరావు, మహాలక్ష్మయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్