కాపు గల్లు లో బ్యాంకింగ్ అవగాహన శిక్షణ కార్యక్రమం

2చూసినవారు
కాపు గల్లు లో బ్యాంకింగ్ అవగాహన శిక్షణ కార్యక్రమం
సూర్యాపేట జిల్లా కాపుగల్లు గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. ATM కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు వివరించారు. సైబర్ మోసాలు, QR కోడ్, లాటరీ, డిజిటల్ అరెస్టు వంటి మోసాలపై ఉదాహరణలతో అవగాహన కల్పించారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని, OTP, UPI PIN వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటనాగ ప్రసాద్, ఆర్. జయరాజ్, పిండి గణేష్ సాగర్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్