వానలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండండి.. ఎస్సై

3చూసినవారు
వానలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండండి.. ఎస్సై
సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చలికంటి నరేష్ గురువారం సూచించారు. రహదారులపై నీరు నిలిచిన చోట జాగ్రత్త వహించాలని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. అనవసర ప్రయాణాలు తగ్గించి, ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్