కోదాడ 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వాడపల్లి రంగమ్మ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ పార్టీ హామీలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.