కోదాడలోని 27వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా షరీఫ్, మహమ్మద్ ఖాలిద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నయీం, షేక్ అబ్బు, మహమ్మద్ శాకీర్, పిట్టల భాగ్యమ్మ, అలీం తదితరులు పాల్గొన్నారు.