కోదాడలో నూతన సంవత్సరం 2026 కు స్వాగతం పలికేందుకు ప్రజలు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేయడానికి, పిల్లలు అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కత్తిరించడానికి కేకులు, స్వీట్లు కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కొత్త దుస్తులు కొనుగోలు చేయడానికి బట్టల దుకాణాల్లో సందడి నెలకొంది. ఆధ్యాత్మిక భావాలున్నవారు పూజల కోసం పూలు కొనుగోలు చేస్తున్నారు.