కోదాడ పరిధిలోని కొమరబండ 11వ వార్డు ఏకగ్రీవంపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, రాస్తారోకో చేసి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన కొమరబండ గ్రామానికి చెందిన 18 మందిపై ఎన్నికల కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అల్లర్లు సృష్టించినా, గొడవలు పడినా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే విధంగా స్టేటస్ లు పెట్టినా వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.