విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసినందుకు కోదాడలోని PM SHRI జడ్పీహెచ్‌ఎస్‌కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రశంసా పత్రం లభించింది. సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఈవో అశోక్ సమక్షంలో పాఠశాల హెచ్‌ఎం సలీం షరీఫ్, ఉపాధ్యాయులకు ఈ పత్రం అందజేశారు.